VZM: బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో జరుగుతున్న రైతన్న మీకోసం సర్వే కార్యక్రమాన్ని విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.కీర్తి ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో తహసీల్దార్ రాజేశ్వరరావు, AO మల్లికార్జునరావు పాల్గొన్నారు.