RR: దేశం గర్వించదగ్గ మహిళా నేత ఇందిరా గాంధీ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరించిందని, షాద్నర్ నియోజకవర్గ మహిళా సమాఖ్య సంఘాలకు మొత్తం రూ. 3,48,68,500 నిధులు జమయ్యాయన్నారు.