Purity of Honey: అమృతం తేనె (Honey). మనలో చాలా మంది తేనెను ఆహారంలో భాగం చేసుకుంటారు. పంచదారకి బదులుగా తేనెను వాడుతూ ఉంటారు. తేనె యాంటీ బ్యాక్టీరియల్ . దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. తేనెలో మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కాకుండా, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, శరీర వ్యవస్థకు సహాయపడతాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చక్కెరలు తేనెకు తీపి రుచిని అందిస్తాయి. మరిన్ని ఇన్ని ప్రయోజనాలు ఉన్న తేనెను మనం స్వచ్ఛమైనదే తీసుకుంటున్నామా? లేక కల్తీ తేనె తీసుకుంటున్నామా? మనం తీసుకునే తేనె స్వచ్ఛమైందోకాదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
తేనె (Honey) స్వచ్ఛతను తెలుసుకోవడానికి మనం ఇంట్లోనే ఓ చిన్న పరీక్ష చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఆ తర్వాత అందులో కాస్త వెనిగర్ వేయాలి. నురుగు వస్తే అది కల్తీ తేనె అని నిర్ధారించుకోవాలి. వెనిగర్ అందుబాటులో లేనివారు ఈ ప్రయోగం చేయవచ్చు. ముందుగా ఒక అగ్గిపుల్లను తీసుకొని తేనెలో ముంచాలి. ఆ పుల్లను అగ్గిపెట్టెపై గంధకానికి గీస్తే మండాలి. లేదంటే అది కల్తీ తేనె (Honey). ఎందుకంటే స్వచ్ఛమైన తేనెకు మండే స్వభావం ఉంటుంది. నాణ్యమైన తేనెలో పత్తి ఒత్తిని ముంచి వెలిగిస్తే వెలుగుతుంది.
మరో టెక్నిక్‌తో కూడా తేనె (Honey) స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. స్వచ్ఛమైన తేనె నీటిలో కరగదు. ఒక స్పూన్ తేనె తీసుకొని నీటిలో వేయాలి. స్పూన్ కదల్చకుండా గ్లాసులో నీటిని కదిలించినప్పుడు అది కరిగితే కల్తీ తేనె అని. కరగకుంటే స్వచ్ఛమైనది అని గుర్తించవచ్చు.