భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆమె వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం వరుడు పలాశ్ ముచ్చల్ వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీతో ఇబ్బంది పడటంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు. అయితే, మరోసారి పలాశ్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ముంబైలోని SVR ఆసుపత్రికి తరలించినట్లు అతని కుటుంబసభ్యులు వెల్లడించారు.