W.G: సంక్రాంతి సమీపించడంతో కోడిపుంజుల విక్రయాలు జోరందుకుంటున్నాయి. బైక్లు, గృహోపకరణాల తరహాలోనే సోషల్ మీడియా వేదికగా పుంజుల ఫొటోలు, వీడియోలు, జాతి, బరువు వంటి వివరాలను పోస్ట్ చేస్తూ విక్రేతలు ఆకర్షిస్తున్నారు. పాలకొల్లులో రహదారుల పక్కన జాతి, సైజును బట్టి ఒక్కో కోడి రూ.1,500 నుంచి రూ. 20,000 వరకు ఉంది. దూర ప్రాంతాల నుంచి విచ్చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు.