TG: శాలిబండలో ఎలక్ట్రానిక్ షాపు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రమాదంలో కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ మణికంఠను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలి వద్ద ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.