ప్రకాశం: ఒంగోలు SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీ కోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇంఛార్జ్ SP ఉమామహేశ్వర ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ DSP రమణకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు. వెంటనే పరిష్కారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.