ATP: మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. సోమవారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన 846 మహిళా సంఘాలకు రూ. 126.46 కోట్లు పంపిణీ చేశారు. అలాగే, 102 మందికి స్వయం ఉపాధి కింద రూ. 1.33 కోట్లు, 879 మంది వీధి వ్యాపారులకు రూ. 2.02 కోట్ల రుణాలు అందించారు.