BPT: చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా అర్జీలు పరిష్కరిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అర్జీదారులకు భరోసా కల్పించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన 62 మంది అర్జీదారులు సమస్యలను జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు.