NLR: బుచ్చి మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యలపై ఆవాజ్ మండల కార్యదర్శి మునిర్ అహ్మద్ కమిటీ సభ్యులతో కలిసి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. రోజురోజుకు పట్టణం అభివృద్ధి చెందుతుంటే జనాభా అధిక సంఖ్యలో పెరుగుతున్నారన్నారు. డ్రైనేజీ వ్యవస్థ ఎటు చూసిన అధికంగా పేరుకుపోవడం వల్ల దోమలు పెరిగాయన్నారు. ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని, సమస్యలు పరిష్కరించాలని కోరారు.