TG: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ చట్టాలు, నియమాల అమలును కట్టుదిట్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం నీటి కాలుష్య కారకాల పరిశ్రమలు 2193, వాయు కాలుష్య కారకాల పరిశ్రమలు 3164 ఉన్నాయని పీసీబీ గుర్తించింది. అందులో 2024 జనవరి నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 305 కంపెనీలను మూసివేసింది. మరో 1,234 పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది.