NDL: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గీత జయసూర్య పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. బ్రిటిష్ పాలనను ఎదిరించి రేనాటి పౌరుషాన్ని పరిచయం చేసిన తెలుగు వీరుడు ఉయ్యాల వాడ అని ఎమ్మెల్యే కొనియాడారు.