ELR: జిల్లాలో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో P.S.H.M. ఫోరం నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ఆదేశాలతో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మోహన్ ఈ వివరాలను తెలిపారు. కమిటీలో జిల్లా గౌరవ అధ్యక్షులుగా పోతురాజు, అధ్యక్షులుగా శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షులుగా కొండయ్య, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ నియమితులయ్యారు.