TG: టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంపై ప్రభుత్వం గొప్పలు చెప్పిందని విమర్శించారు. నెలరోజుల్లో వైద్య సేవలు ప్రారంభిస్తామని ప్రకటించిందని.. నెల రోజులు దాటినా నిర్మాణమే పూర్తి కాలేదని చెప్పారు.