KDP: సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని APSP 11వ పోలీసు బెటాలియన్లో ఆదివారం శ్రీ సత్య సాయి బాబా 100వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పి.రాజశేఖర్ హాజరై సాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడని పలువురు విశ్వసిస్తారని కమాండెంట్ అన్నారు.