ASR: అరకు అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే జలపాతం దగ్గర పర్యాటకుల రద్దీ పెరిగింది. జలపాతంలో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.