గౌహతి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా బ్యాటర్ ముత్తుస్వామి(101*) సెంచరీ చేశాడు. ఇది అతనికి తొలి సెంచరీ కాగా.. ప్రొటీస్ 7 వికెట్లు కోల్పోయి 418 రన్స్ చేసింది. మరో బ్యాటర్ యాన్సెన్(49*) హఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ జోడీ ఇప్పటికే 85 బంతుల్లో 84 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పగా.. బవుమా సేన భారీ స్కోర్ దిశగా సాగుతోంది.