VSP: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ సందర్శకులుతో ఆదివారం కిటకిటలాడింది. ఈ రోజు మొత్తం 10,352 మంది సందర్శకులు జూ పార్క్‌ను సందర్శించారని క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. రూ.7,63,450 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో జూపార్క్ అంతా సందడి వాతావరణం నెలకొంది. చిన్న, పెద్ద అంతా కలిసి ఆటపాటలతో కార్తీక వనభోజన చేశారు.