ఇంగ్లండ్ యువ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రేయసి ఇసాబెల్లా గ్రేస్ సైమండ్స్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో తొలిసారిగా కలిశారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ఇసాబెల్లా కొన్నాళ్లుగా సామ్‌తో పాటు మ్యాచులకు హాజరవుతూ కనిపించింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సామ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.