ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై గెలిచినప్పటికీ ఆస్ట్రేలియా భారీ మొత్తంలో నష్టపోయింది. మ్యాచ్ 2 రోజుల్లోనే ముగియడంతో 3, 4 రోజుల కోసం ఉంచిన టికెట్ల ఆదాయం కోల్పోయింది. ఈ క్రమంలో ఆసీస్ $3 మిలియన్లు(₹17.35Cr) నష్టపోయినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా తొలి 2 రోజుల్లో ఆట చూసేందుకు లక్ష మందికిపైగా హాజరయ్యారు.