KMM: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని, పథకాలను ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తోన్న ఇందిరమ్మ చీరలను ఆదివారం రఘునాథపాలెం మండలంలో పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మహిళలకు చీరలను అందించారు.