WGL: వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులతో మావోయిస్టు పార్టీ దాదాపు వెంటిలేటర్‌పైకి చేరింది. పార్టీ మనుగడకు తెలంగాణకు చెందిన నేతలే ప్రధాన ఆధారంగా మారారు. TG DGP శివధర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. కేంద్ర కమిటీలో ముప్పాల లక్ష్మణ్ రావు, మల్ల రాజిరెడ్డి, తిరుపతి, గణేష్, బడే చొక్కారావు ఉన్నారు. రాష్ట్ర కమిటీలో 10 మంది, అజ్ఞాతంలో 59 మంది కొనసాగుతున్నారని తెలిపారు.