KNR: కరీంనగర్లోని కిసాన్ నగర్ సమీకృత మార్కెట్ అభివృద్ధి పనులపై విజిలెన్స్ ఎంక్వైరీకి మున్సిపల్ శాఖ సిఫార్సు చేసింది. తొలి విడత పనులకు సంబంధించిన ఎంబీ (మెజర్మెంట్ బుక్) కనిపించకుండా పోవడం, అంచనాకు మించి నిధుల దుర్వినియోగం జరిగిందని మాజీ ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో చేసిన పనులకు బిల్లులను కూడా నిలిపివేశారు.