WGL: నల్లబెల్లి వెజిటబుల్ & ఫ్రూట్స్ సొసైటీ వద్ద ఇవాళ క్యూ లైన్లో నిలబడి యూరియా కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. యాసంగి వరి, మొక్కజొన్న పంటల దిగుబడి కోసం యూరియా బస్తాలు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బస్తాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను అన్నదాతలు కోరారు.