GNTR: పెదకాకాని గ్రామ పంచాయతీ వద్ద శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల నోటిఫైని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి, 12 గంటలుకు పంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.