MBNR: రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని జిల్లా వికలాంగ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వికలాంగులకు పెన్షన్ 6000కు పెంచాలని, వృద్ధులు మహిళలకు కూడా పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నాడు. వికలాంగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.