బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించేలా రాజ్యాంగాన్ని సవరించే వరకు పోరాటం చేస్తానని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం మాత్రమే రాష్ట్రాన్ని పాలించాలి. రాష్ట్రంలో రెండు అధికార కేంద్రాలు ఉండకూడదు’ అని అన్నారు. చట్టసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా ఆపి ఉంచడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించారు.