టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓ నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చింది. జిమ్ చేస్తున్న ఫొటోలను సమంత తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే, ఎక్కువగా వ్యాయామం చేయడం మంచిది కాదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీంతో ‘అవసరం అయినప్పుడు మీ సలహా అడుగుతాను’ అని అతడికి కౌంటర్ ఇస్తూ సమంత రిప్లై ఇచ్చింది.