W.G: దేశభక్తులు, స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతోత్సవాలను నిర్వహించనున్నారు. శ్రీ విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తెలిపారు. ఈనెల 22 నుంచి24 వరకు భీమవరం బ్యాంకులు, కళాశాలల్లో కార్యక్రమాలు జరుగుతాయి. ముగింపు రోజున రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులను సత్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.