TPT: నెయ్యి కిలో రూ.351కే నాసిరకం అంటున్న చంద్రబాబు గతంలో ఆయన హయాంలో రూ.276కి ఎలా కొనుగోలు చేశారని TTD మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అది నాసిరకం కాదా అన్నారు. కల్తీ అని అంటున్న నెయ్యిని లడ్డూలో వాడారో లేదో భక్తులకు చెప్పాలన్నారు. చిన్న అప్పన్న నిజంగా తప్పు చేసి ఉంటే ఆయనకు సహకరించిన టీటీడీ అధికారులను సైతం శిక్షించాలని డిమాండ్ చేశారు.