శ్రీకాకుళం నగరంలోని బ్యాంకర్స్ కాలనీలో ఉన్న శ్రీ సత్య సాయి బాబా ఆలయంలో ఈ నెల 23న జరగనున్న శతజయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు కమిటీ తరఫున ఆహ్వానం అందజేశారు. శతజయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు.