NZB: వర్ని మండలం జలాల్పూర్ పెద్ద చెరువులో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత చేప పిల్లలను వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు విడుదల చేశారు. మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీతో చేప విత్తనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.