NDL: బనగానపల్లె మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులను శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి అభినందించారు. అభిషేక్ రాజ్, నందిని, అర్చన అనే క్రీడాకారులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. కాకినాడ, చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో ఎంపికైన వారు పాల్గొంటారని ఫిజికల్ డైరెక్టర్ సుధాకర్ తెలిపారు.