ATP: అంబికా ఫౌండేషన్, దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 82 మంది ఎంపికయ్యారు. వీరిలో తొలి బ్యాచ్‌కు చెందిన 20 మంది అభ్యర్థినిలను హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి పంపేందుకు అంబికా ఫౌండేషన్ ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పించింది. అనంతపురం నుంచి హోసూరు వరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయడంతో, యువతులు హర్షం వ్యక్తం చేశారు.