సాహో, రాధే శ్యామ్ వంటి ఫ్లాపుల తర్వాత.. ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్స్ ఆదిపురుష్ పై అంచనాలను పెంచేలా చేసింది. దాంతో ఆదిపురుష్ భారీ ఓపెనింగ్స్ రాబట్టడం పక్కా అంటున్నారు. అందుకు తగ్గట్టే.. టికెట్ రేట్లు షాక్ ఇస్తున్నా.. యూస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయినట్టు తెలుస్తోంది.
Adipurush: ఆదిపురుష్ (Adipurush) సినిమా అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ అవడానికి కాస్త టైం ఉన్నా.. యూఎస్‌లో మాత్రం కొన్ని చోట్ల బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఒక్క రోజు ముందే, అంటే జూన్ 15న యూఎస్‌లో ప్రీమియర్స్ షో పడనున్నాయి. అందుకే సినిమా విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉండగానే.. కొన్ని లోకేషన్స్‌లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్‌ను అలా ఓపెన్ చేశారో లేదో.. టికెట్స్ హాట్ కేక్‌లా అమ్ముడు పోయాయి.
టికెట్ రేట్ 20 డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో 1600 రూపాయలకు పైగా ఉన్నప్పటికీ.. బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్ (Adipurush) క్రేజ్‌కు ఇదే నిదర్శనం అంటున్నారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అక్కడ ఆదిపురుష్ రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక డే వన్ ఆదిపురుష్ ఓపెనింగ్స్ 200 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. లాంగ్ రన్లో 1000 నుంచి 1500 కోట్ల రాబట్టే ఛాన్స్ ఉంది.