WGL: పట్టణంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో నిన్న హుండీ లెక్కింపులో రూ.65,93,481 నగదు సేకరణ జరిగింది. ఈ లెక్కింపులో విదేశీ కరెన్సీలో యూఎస్ డాలర్లు 2,483, ఆస్ట్రేలియా డాలర్లు 55, సింగపూర్ డాలర్లు 10, యూఏఈ దిర్హమ్ 15, ఖతర్ రియాల్ 3 లభించాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలను తిరిగి హుండీలో జమ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.