MDK: రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ తెలిపారు. వ్యవసాయ డివిజన్ పరిధిలోని నిజాంపేట, నార్సింగి, చేగుంట, రామాయంపేట మండలాలకు చెందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు హాజరవుతారు.