SRCL: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన లంబ రాములు (51) మతిస్థిమితం సరిగా లేక మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మందు తాగి మృతిచెందినట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. మృతుని కుమారుడు వచ్చి చూడగా ఈ విషయం తెలిసిందన్నారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.