GNTR: సిరిపురం నుంచి పెద్దకూరపాడు వెళ్లే మార్గంలోని రైలు గేటును మరమ్మతుల నిమిత్తం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మూసివేత గురు, శుక్ర, శనివారం వరకు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు వరగానికి వెళ్లే దారిలోని రైలు గేటు గుండా రాకపోకలు సాగించవచ్చన్నారు.