»Former Aap Minister Satyendar Jain Granted Bail For 6 Weeks
Satyendar Jain: ఆప్ మాజీ మంత్రికి 6 వారాలు బెయిల్ మంజూరు
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఐసీయూలో చేర్చిన ఒక రోజు తర్వాత, వైద్య కారణాలతో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్వాసకోశ సమస్యల కారణంగా జైన్‌ను ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేర్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యేంద్ర జైన్.. చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో మగ్గుతున్న ఆయన.. అనారోగ్యంతో బాత్రూంలో జారిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది ఆయన్ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో.. నగరంలోని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు ICUలో ఆక్సిజన్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అతనికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఆరు వారాల పాటు మంజూరు చేసింది. ఈ క్రమంలో వైద్య కారణాలతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపింది. గత ఏడాది మేలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినప్పటి నుంచి ఆప్ నాయకుడు తీహార్ జైలులో ఉన్నాడు.
జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్..గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జారి పడ్డారని.. జైలు సీనియర్ అధికారి తెలిపారు. మొదట సాధారణ బలహీనతగా భావించామని.. జనరల్ అబ్జర్వేషన్లో ఉంచగా.. క్రమంగా పరిస్థితి విషమించిందన్నారు. జైన్ వెన్నుముక, ఎడమ కాలు, భుజంలో నొప్పి రావటం వల్ల వైద్యుల సూచన మేరకు ఆయన్ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు.