VZM: జిల్లాలో త్రాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సురక్షిత నీటిని సరఫరా చేయాలని, తద్వారా నీటి ద్వారా సంక్రామించే వ్యాధులు అరికట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన వాటర్& శానిటేషన్ కమిటీ సమావేశంలో స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్ క్రింద చేపట్టిన పనులను నిర్దేశిత లక్ష్యాలకు పూర్తి చేయాలన్నారు.