SRCL: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుని రైతుల మద్దతు ధర పొందాలని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. కొనరావుపేట, చందుర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ ధాన్యానికి రూ.2369 మద్దతు ధర ఇస్తుందని పేర్కొన్నారు.