ఓ వ్యక్తి తన వాహనానికి వచ్చిన ట్రాఫిక్ చలాన్లు కట్టలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే మళ్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(54) వరంగల్ నగరంలోని ఓ బట్టల షాపులో పనిచేసేవాడు. అయితే మొగిలి రోజు షాపుకు వెళ్తూ పని చేస్తూ జీవనం కొనసాగిస్తాడు. అతని భార్య అదే ప్రాంతంలో పనిచేస్తుంది. మరోవైపు అతని కుమారుడు సూర్య కూడా అదే బైక్ ఉపయోగించేవాడు.
ఆ క్రమంలో అతని వాహనం పలుమార్లు ట్రాఫిన్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా అధికారులు చలాన్లు వేశారు. మొత్తంగా 9 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులు ఓ సారి అతని బైక్ అపి ట్రాఫిక్ చలాన్లు కట్టాలని మొగిలిని కోరారు. అంతటితో ఆగకుండా చలాన్లు కట్టిన తర్వాతనే బైక్ తీసుకెళ్లాలని చెప్పి అతని వాహనం తీసుకెళ్లారు. దీంతో మొగిలి ఆటోలో వెళ్లిపోయాడు.
కానీ తర్వాత బైక్ లేకపోవడం వల్ల మొగిలి రోజు షాపుకు వెళ్లలేక ఇబ్బంది పడి మనస్తానికి గురయ్యాడు. ఆ నేపథ్యంలో ఆత్యహత్యనే శరణ్యమని భావించి పురుగుల మంది తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఆ క్రమంలో గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొగిలి మరణించారు. అయితే తన తండ్రి మృతికి కారణం ట్రాఫిక్ పోలీసులే కారణమని కుమారుడు సూర్య హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైట్ చేశాడు.