SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో బుధవారం గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పూల మాల వేసి పండ్లు, స్వీట్లు పంచి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాటాడుతూ.. భారతదేశానికి మొటమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి చేసిన ఆమె సేవలను కొనియాడారు.