ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇవాళ దోర్నాలకు రానున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి రవితేజ తెలిపారు. ఆర్డీటీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కలెక్టర్ అధ్యక్షతన పీఎం జన్మన్- ధర్తి ఆబజన్- జాతీయ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాల అమలు, పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు.