Gautam Adani has scraped his way back into the world's top billionaires' list
Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) ఈజ్ బ్యాక్. ఆయన మళ్లీ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో చేరాడు. నష్టపోయిన మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాడు. గ్లోబల్ టాప్-20 సంపన్నుల జాబితాలో అదానీకి చోటుదక్కింది. అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ర్యాలీ కొనసాగుతుండడంతో ఆయన ఆస్తి విలువ 4.38 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెంది 64.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.
కొంతకాలం క్రితం హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వ్యవహారం ప్రభావంతో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ (Adani) గ్రూపు కంపెనీల విలువ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. కంపెనీల షేర్లు ఒక్కసారిగా పతనం అవ్వడంతో విలువ అమాంతం పతనమైంది. గౌతమ్ అదానీ (Adani) వ్యక్తిగత సంపద కూడా భారీగా క్షీణించింది. తాజాగా సుప్రీం కోర్టులో సెబీ దర్యాప్తు వ్యవహారంలో ఊరట లభించిన తర్వాత గ్రూప్ షేర్లు పరుగులు పెట్టాయి. దీంతో ఆయన సంపద క్రమంగా పెరుగుతోంది.
అదానీ (Adani) గ్రూపు కంపెనీల షేర్లలో ర్యాలీ కొనసాగుతుండటంతో ఆయన ఆస్తి విలువ 64.2 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఆయన 18వ స్థానంలో నిలిచారు. సెప్టెంబర్ 2022లో ఏకంగా 254 బిలియన్ డాలర్లతో గ్లోబల్ టాప్-2 సంపన్నుడిగా నిలిచిన అదానీ.. హిండెన్‌బర్గ్ వ్యవహారం ప్రభావంతో ఈ ఫిబ్రవరిలో సంపద విలువ భారీగా పతనం అయ్యింది. గ్లోబల్ టాప్-20 బిలియనీర్ల జాబితా నుంచి అదానీ (Adani) నుంచి వైదొలిగారు. అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు పెట్టుబడుల దిగ్గజం జీక్యూజీ ప్రకటించడం, హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సుప్రీంకోర్ట్ క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీల షేర్లలో ఈ వారం ర్యాలీ కొనసాగుతోంది.