»Prime Minister Modi And Telangana Cm Revanth Reddy Are In The List Of Most Powerful Indians
Powerful Indians: అత్యంత శక్తివంతమైన భారతీయుల్లో ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి
ప్రతీ సంవత్సరం విడుదల చేసే అత్యంత శక్తివంతమైన జాబితాను ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించింది. అందులో ప్రధాని మోడీ ఎప్పటి లాగానే మొదటి స్థానంలో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో స్థానం సంపాదించుకున్నారు.
Prime Minister Modi and Telangana CM Revanth Reddy are in the list of most powerful Indians
Powerful Indians: అత్యంత శక్తివంతమైన 40 మంది భారతీయుల్లో ప్రధాని నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. ఈ సంత్సరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన జాబితాలో ప్రధాని మోదీ మొదటిస్థానంలో కొనసాగుతున్నారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండో స్థానంలో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 39వ స్థానం దక్కించుకున్నారు. రేవంత్ రెడ్డి కంటే ఒక స్థానం ముందు అంటే 38వ స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నారు.
1. నరేంద్ర మోదీ, భారత ప్రధాని
2. అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
3. మోహన్ భగవత్, ఆరెస్సెస్ చీఫ్
4. డీవై చంద్రచూడ్, భారత ప్రధాన న్యాయమూర్తి
5. ఎస్ జైశంకర్, విదేశాంగ మంత్రి
6. యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
7. రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి
8. నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
9. జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
10. గౌతం అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్
11. ముఖేష్ అంబానీ, రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
12. పీయూష్ గోయల్, వాణిజ్య మంత్రి, సభా నాయకుడు, రాజ్యసభ
13. అశ్విని వైష్ణవ్, రైల్వే, టెలికాం అండ్ ఐటీ శాఖ మంత్రి
14. హిమంత బిస్వా శర్మ, అసోం ముఖ్యమంత్రి
15. మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
16. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకుడు
17. అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు
18. అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
19. శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
20. హర్దీప్ సింగ్ పూరి, కేంద్రమంత్రి
21.సంజీవ్ ఖన్నా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
22. సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
23. మన్సుఖ్ మాండవియా, కేంద్రమంత్రి
24. నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి
25. ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
26. నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అండ్ వ్యవస్థాపకురాలు
27. షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడు
28. నటరాజన్ చంద్రశేఖరన్, టాటా గ్రూప్ చైర్పర్సన్
29. సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
30. రాహుల్ నవీన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
31. భూపేందర్ యాదవ్, కేంద్రమంత్రి
32. అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
33. ధర్మేంద్ర ప్రధాన్, కేంద్రమంత్రి
34. దత్తాత్రేయ హోసబాలే, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి
35. జై షా, బీసీసీఐ కార్యదర్శి
36. మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు
37. అజీమ్ ప్రేమ్జీ, విప్రో వ్యవస్థాపకుడు
38. విరాట్ కోహ్లీ, క్రికెటర్
39. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
40. వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్