»Market Value Of Lic Investment In Adani Stocks Hits Rs 44670 Crore
Adani: ఇన్ వెస్ట్ చేసిన LICకి లాభాల పంట..!
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత కనిష్ట స్థాయిల నుంచి అదానీ గ్రూప్(adani group)లోని స్టాక్ ధరలు క్రమంగా పుంజుకున్నాయి. దీంతో ఏడు కంపెనీల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో చేసిన పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.44,670 కోట్లకు పెరిగింది. ఈ సంస్థలో అదానీ స్టాక్ తన హోల్డింగ్‌ల మార్కెట్ విలువ ఏప్రిల్ నుంచి దాదాపు రూ.5,500 కోట్లు పెరిగినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా వెల్లడించింది.
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ(Life Insurance Corporation) కి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎల్ఐసీకి లాభాల పంట వచ్చింది. అదానీ గ్రూప్ లో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుతున్నాయి. దీంతో అదానీ గ్రూప్‌లోని ఏడు కంపెనీల షేర్లు పెరగడంతో ఎల్ఐసీకి మళ్లీ లాభాలు వస్తున్నాయి. బుధవారం ఈ ఏడు కంపెనీల షేర్లు నష్టాలతో ముగిసినా ఇటీవల ర్యాలీ కారణంగా వాటిలో ఎల్ఐసీ(LIC) పెట్టుబడుల విలువ మాత్రం రూ.44,670 కోట్లకు చేరింది. దీంతో ఎల్ఐసీ అసలు పెట్టుబడి విలువ రూ.30,127 కోట్లు తీసేస్తే, ఈ షేర్లలో ఎల్ఐసీ ఇప్పటికీ రూ.14,543 కోట్ల లాభాల్లో ఉంది.
ఇందులో రూ.5,500 కోట్ల లాభం, గత రెండు నెలల్లోనే సమకూరింది. నిజానికి ఈ ఏడాది జనవరి 27 నాటికి ఏడు అదానీ గ్రూప్(adani group) కంపెనీల షేర్లలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.56,142 కోట్లు. హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదిక దెబ్బతో ఫిబ్రవరి 23 నాటికి అది రూ.27,000 కోట్లకు పడిపోయింది. అపుడు సరైన ముందు జాగ్తత్త లేకుండా గుడ్డిగా అదానీ కంపెనీల షేర్లలో మదుపు చేశారని ఎల్ఐసీపైనా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అదానీ గ్రూపు షేర్లు మళ్లీ లాభాల బాట పట్టడంతో ఆ విమర్శలకు తెరపడినట్లైంది.