AP: తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో తెల్లవారుజామున మొదలైన వర్షం నిరంతరంగా పడుతోంది. స్వామివారి దర్శనానికి, లడ్డూ విక్రయశాలకు వెళ్లే భక్తులు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత అధికమవుతుండటంతో పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. రెండు ఘాట్ రోడ్డులలో ప్రయాణించే భక్తులను విజిలెన్స్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.