KDP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. నిన్న తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులతో యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు.